దర్శి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీజీ పిలుపు మేరకు స్వచ్చతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. దర్శి బాలుర వసతి గృహంలో పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రం చేసారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలకు దూరంగా ఉండాలని చెప్పారు. యువత స్వచ్ఛత వైపు శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకతను వివరించారు. దర్శి అసెంబ్లీ కన్వినర్ మాడపాకులు శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు గురువర్ధన రావు, బచ్చు అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.



