ఒంగోలు రాజీవ్ నగర్ కి చెందిన రిటైర్డ్ విద్యుత్ ఎఈ వెంకట రమణ మనుమడు 8 సంవత్సరాల వయస్సు ఉన్న అక్షజ్ ఉదయ్ వాల్ చిన్న వయస్సులోనే పర్వతారోహణ చేస్తూ ప్రశంశలు అందుకుంటున్నాడు. ఇతను ఇప్పటికే ఆసియా బుక్ రికార్డ్లో స్థానం సంపాదించాడు. తాజాగా సెప్టెంబర్ 4వ తేదిన టర్కీ దేశంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఆరారట్ పర్వతాన్ని 4200 మీటర్లు అధిరోహించి అక్కడ భారత పతాకాన్ని ప్రదర్శించాడు. ఈస్ట్రన్ టర్కీ నుండి సెప్టెంబర్ 2న బయలు దేరి పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ ఉష్ణోగ్రత ఉదయం -5 డిగ్రీలు, రాత్రి వేళ – 15 డిగ్రీలు ఉష్ణోగ్రత సైతం తట్టుకుని పర్వాతాన్ని అధిరోహించాడు.
అక్షజ్ 2021 ఎప్రియల్ 28న తన తల్లి అనురాధతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడ 4000 మీటర్ల ఎత్తులో ఉన్న చంద్రషీలను అధిరోహించాడు. అదేవిధంగా నేపాల్ లో మౌంట్ నగాకర్షన్ ఎవరెస్ట్ రీజియన్ 5077 మీటర్లు సైతం అధిరోహించాడు. 2022 ఎప్రియల్ 30న నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో 5354 మీటర్లు అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం సంపాదించాడు. 2023 మే 29న ఎవరెస్ట్ డే సందర్భంగా మస్కట్లో నేపాల్ రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అక్షజ్ పాటు ఆయన తల్లిదండ్రులు అమిత్, అనురాధలను ఆహ్వానించి నేపాల్ రాయబారి దోర్నాద్ అల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రిషియేషన్ ను అందించారు.






