పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పెస్ కళాశాల పిన్సిపాల్ డాక్టర్ జీవికే మూర్తి అన్నారు. పెస్ కళాశాల విద్యార్థులు ఆదివారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల ఎన్సీపీ విభాగపు విద్యార్థులు వల్లూరు, కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్, గాజు, ఇతర వ్యర్థాలను తీసివేసి పరిసరాలను శుభ్రం చేసారు. ప్లాస్టిక్ బూతంపై
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నివారించాలని 34 ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్
కె సత్యనారాయణ అన్నారు. విద్యార్థులకు జీవితంలో క్రమశిక్షణ, పరిశుభ్రత
ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి
శ్రీధర్, ఫిజికల్ డైరెక్టర్ మధుసూధనరావు, ఫెస్ కళాశాల ఎఎన్ పృద్విక్రిష్ణ తదితరులుపాల్గొన్నారు.

