ఒంగోలు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గం ఆదివారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక శ్రీరామ్ హైస్కూల్ లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషన్ సమావేశం రామాంజనేయులు అధ్యక్షతన సభను నిర్వహించారు. ఛాంబర్ లో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు ఇంత ఎజెండా అంశాలను చర్చించారు. నూతన అధ్యక్షుడిగా కొనంకి వెంకట వరుణ్ కుమార్, కార్యదర్శిగా సింగమనేని పార్థసారధి, కోశాధికారిగా నరేంద్రకుమార్ ల ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు నూతన కార్యవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఛాంబర్ అభ్యున్నతికి కృషి చేస్తామని, ఛాంబర్ ద్వారా యువతకు వ్యక్తిగత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోన్ ప్రసిడెంట్ కొండలు, రవికుమార్, వివి రమణ, శివ ప్రసాద్, రాజేష్, కూరపాటి రమేష్, అద్దంకి శ్రీనివాసరావు, కసిబిసి నాగేశ్వరరావు, రవీంద్ర, బెడవాడ పవన్ కుమార్, ఎం శేఖర్ బాబు, రామక్రిష్ణ, దాది ఆంజనేయులు, జాలి రెడ్డి, శ్రీరాములు రెడ్డి, బొమ్మల శ్రీనివాసరావు, ఎస్.డి ఇస్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.
