గాంధీ మార్గమే ఈ దేశానికి శరణ్యమని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బిఆర్ గౌస్ అన్నారు. గాంధీజీ జయంతిని పురష్కరించుకుని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి అద్దంకి బస్టాండ్ మీదుగా గాంధీ రోడ్లోని గాంధీజీ విగ్రహం వరకు భారత్ జోడో మార్చ్ నిర్వహించారు. బాపూజి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగాయువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బిఆర్ గౌస్ మాట్లాడుతూ…. సత్యం అహింస ద్వారా దేనినైనా సాధించవచ్చు అని గాంధీజీ నిరూపించారని, అవే విషయాలను కొనసాగిస్తూ భారతదేశంలో పెట్రేగిపోతున్న హింసకు వ్యతిరేకంగా, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, మతాల పేరుతో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, భారతదేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా, రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలకు వ్యతిరేకంగా, దేశ ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందించాలని సదుద్దేశంతో దేశంలో పెరిగిపోతున్న విద్వేష పరిస్థితులను రూపుమాపి ప్రజల మధ్య సోదర భావం, ప్రేమానురాగాలు పెంపొందించి భారతదేశాన్ని అభివృద్ధి వైపు ఆలోచించే విధంగా రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడోయాత్ర గాంధీ సందేశాన్ని దేశానికి పంచిందని రాబోవు రోజుల్లో ఈ దేశంలో విద్వేషపు ప్రభుత్వానికి చరమ గీతం పాడి ప్రజలు అభివృద్ధి వైపు పయనించే రోజులు దగ్గర పడ్డాయని, ఈ దేశానికి ఎప్పటికీ గాంధీ మార్గమే అనుసరణీయమని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి, రాష్ట్ర కార్యదర్శులు ప్రవీణ్, రాజశేఖర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గిడ్డ యోను, గుత్తి రాజు, భరత్, షేక్ రసూల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

