జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం
మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిథి శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అహింస, శాంతి మార్గాలలో భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలచారని వక్తలు అన్నారు. పార్టీ అధికారి ప్రతినిథి షేక్ సైదా, డీసీపీ ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, ఐఎన్టీయుసీ అధ్యక్షుడు ఉంగరాల శ్రీనివాసరావు, ఒంగోలు మండల అధ్యక్షుడు తెలగపూడి బుజ్జి, కదుకూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్, ఎన్ఎస్ఎయూఐ నాయకులు రవి, సుభాన్, రఫీ, ఉల్లా, ప్రేమ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
