ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సాహించాలని బిజేపి జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి అన్నారు. గాంధీజయంతిని పురష్కరించుకుని ప్రధాని దామోదర్ దాస్ మోదీ పిలుపు మేరకు ఆపార్టీ నాయకులు ట్రంకురోడ్డు నందలి ఖాదీ బండార్ను సందర్శించారు. అక్కడ ఉన్న వస్త్రాలను పరిశీలించి ఖాదీ వస్త్రాలను ధరిస్తే సౌకర్యవంతంతో పాటు ఎంతో హుందాగా ఉంటాయని అన్నారు. కనీసం ఒక్క రోజైనా, చేనేత వస్త్రాలను ధరించాలని, దానికి అనుగుణంగా, చేనేతరంగానికి మన వంతు సహాయం చేసిన వారమవుతామని అన్నారు .
కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి పునుగుల రవిశంకర్, పార్లమెంటు కన్వినర్ సెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు బద్దులూరి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, పద్మావతి, క్రిష్ణవేణి, మహిళా మోర్చ జిల్లా ఇన్చార్జి తీగల క్రిష్ణవేణి, ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, ఐటీ సెల్ కన్వినర్ సత్యనారాయణ, స్కిల్ ఇండియా కన్వినర్ తిరుమలరావు, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, యువజన, మైనార్టీ, ఓబీసీ మోర్చా నాయకులు దామోదర్, సుభాని, వెంకట శివ, సోషల్ మీడియా కన్వినర్ ధనిశెట్టి రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.


