భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా
రంగారాయుడు చెరువు వద్ద ఉన్న బాపూజి విగ్రహానికి ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు పివీ శివా రెడ్డి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ సాతంత్య్రం కోసం నాడు మహాత్ముడు చేసిన త్యాగాలను వక్తలు గుర్తు చేసారు. పార్టీ జిల్లా ఇన్చార్జి పునుగుల రవిశంకర్, పార్లమెంటు కన్వినర్ సెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు బద్దులూరి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, పద్మావతి, క్రిష్ణవేణి, మహిళా మోర్చ జిల్లా ఇన్చార్జి తీగల క్రిష్ణవేణి, ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, ఐటీ సెల్ కన్వినర్ సత్యనారాయణ, స్కిల్ ఇండియా కన్వినర్ తిరుమలరావు, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, యువజన, మైనార్టీ, ఓబీసీ మోర్చా నాయకులు దామోదర్, సుభాని, వెంకట శివ, సోషల్ మీడియా కన్వినర్ ధనిశెట్టి రాము నాయుడు అన్ని విభాగాల బాధ్యులు పాల్గొన్నారు.
