తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో గాంధీజి జయంతి సందర్భంగా
సోమవారం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని మహాత్మాగాంధీ విగ్రహానికి రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు ఎస్ అంజి రెడ్డి, ఉపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బారెడ్డి, రిటైర్డు బ్యాంకు ఉద్యోగి యోగి రెడ్డిల ఆధ్వర్యంలో పూల
మాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ జీవిత చరిత్రను, దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గొప్పదనాన్ని వివరించారు. వారి జీవిత చరిత్రలు ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలని దీవించారు.

