మహాత్మా గాంధీజీ చూపిన మార్గం ఆచరణీయమని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. సోమవారం విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు, పార్టీ పెద్దలు పాల్గొన్న ఈ వేడుకల్లో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పాల్గొని మహాత్ముడి చిత్ర పటానికి పూల దండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శిద్దా రాఘవరావు మాట్లాడుతూ మహాత్ముడి జీవితం అందరికి ఆదర్శనీయం అన్నారు. ఆయన చూపిన మార్గంలో మనందరం ప్రయణించాలని పేర్కొన్నారు.
