దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మండలంలో మంగళవారం కురిచేడు మండలంలో పర్య టించారు. పలువురు వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించారు. పడమర నాయుడుపాలేనికి చెందిన వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బొమ్మన బోయిన వెంకయ్య అనారోగ్యంతో బాధపడుతుండ టంతో ఆయన నివాసానికి వెళ్లిపరామర్శించారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేసి తన తండ్రి దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి పేరుతో అం దించేందుకు అంగీకరించారు. ఆవులమంద ఎస్సీ కాలనీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 5 లక్షలతో వాటర్ ప్లాంటు మంజూరు చేశారు. చెరువుకట్ట పటిష్టానికి రూ. 3 లక్షలు మంజూరు చేశారు. కురిచేడులోని మీనిగ వెంకటేశ్వర్లు మృతి చెందటంతో ఆయన భార్యకు రూ. 25,000 అందిం చారు. నరసయ్య అనే వికలాంగుడికి 3 చక్రాల వాహనం మంజూరు చేశారు. కాటంవారిపల్లెలో కార్యకర్త రమణారెడ్డి భార్య మృతి చెందింది. కుటుంబాన్ని పరామర్శించారు. జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, పడమర నాయుడు పాలెం, కురి చేడు సర్పంచులు బి. మహష్ కె, కృష్ణయ్య, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎం బాషా, రహంతుల్లా, మేరువ సుబ్బారెడ్డి, పి. నాగిరెడ్డి, ఎంపీటీసీ బుల్లం వెంకట నరసయ్య, నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, నుసుం ప్రతాపరెడ్డి, వీరగంధం కోటయ్య, ఎన్వీ నాగిరెడ్డి, లింగారెడ్డి, నారు శ్రీనివాసులరెడ్డి, బొరిగొర్ల గోవిందు, సద్ది పుల్లారెడ్డి, దర్శి మాజీ ఎం.పి.పి ఇత్తడి దేవదానం, సర్పంచ్ ల సంఘము అధ్యక్షుడు కేసరి రాంభూపా ల్ రెడ్డి, ఇందూరి వెంకటనర్సిరెడ్డి, పాతకోట వెం కటరెడ్డి, షేక్ మౌలాలి, భాస్కరరెడ్డి, పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, పి. చిన్నపెద్దయ్య, గొట్టిపాటి రాములు, రంగారావు, మట్టె వెంకటేశ్వర్లు, దాస రిరమేష్, కౌలూరి నరసింహులు పాల్గొన్నారు. పలువురు నాయకులకు పరామర్శించారు.




