వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనా రోగ్యానికి గురయ్యారని తెలియడంతో వారిని దర్శి మాజీ శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మంగళవారం పరామర్శించారు. దర్శి లోని క్రిస్టియన్ పాలానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కొడవటి జాన్ గుండెకు సంబంధించిన చికిత్స ఉంది ఉండడంతో ఆయనను పరామర్శించారు .ఆరోగ్య వివ రాలు తెలుసుకున్నారు. చలివేంద్రం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొండలుకు రూ. 25 వేల ఆర్థిక సహాయం చేశారు.
మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైఎస్ఆర్సిపి డాక్టర్ సంఘ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, గోగులముడి లింగారెడ్డి, పాణెం కృష్ణారెడ్డి, సర్పంచుల సంఘం దర్శి మండల అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


