వైయస్ ఆర్ టిఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఎంపీపీ స్కూల్ పోలవరం ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడు పర్వతం రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ముండ్లమూరు మండల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో జిపిఎస్ గురించి, జీతాలు సకాలంలో అందించే సమస్య, 2003 డీఎస్సీ వారికి, పాత పెన్షన్ అందించే విషయం, సగటు ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రతినిధులకు గట్టిగా తన గలాన్ని వినిపించి నా వైయస్సార్ టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతం రమణారెడ్డికి అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో యశ్వంత్, బాబురావు, నాగరాజు, ఉత్తమ్, అబ్దుల్లా షేక్, ఎడవల్లి శివ, శ్రీనివాసరావు, ఆవుల సునీత, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గుమ్మడిల్లి వెంకటరావు, షేక్ కాలేషా వలి, ప్రభాకర్ ,చక్రపాణి ,సుబ్బరాజు ,గంగాధర్ లు ఉన్నారు.
