దళిత ఆదివాసి మేనిఫెస్టో జిల్లా సదస్సును జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరగనున్న ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నుండి మేనిఫెస్టో అమలు చేస్తున్నందున దళిత ఆదివాసి మేనిఫెస్టో జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని దళిత బహుజన సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు బుధవారం ఓ ప్రకటనలోతెలిపారు. ముండ్లమూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 23% పైగా జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీలు ప్రజలు ఉన్నారన్నారు. వివిధ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వీరికి సమాజంలోని మిగిలిన ప్రజలకు మధ్య అభివృద్ధిలో ఉన్న అవాంతరాలను వాటి పరిష్కారం కొరకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో బహుజనుల సంక్షేమం అభివృద్ధి, హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంఘాలు, సంస్థలు ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేద్దాం అన్నారు.ఈనెల 5వ తేదీన ఒంగోలులోని ప్రెస్ క్లబ్ నందు దళిత ఆదివాసి మేనిఫెస్టో పై చర్చించేందుకు ముళ్ళమూరు మండలంలోని అన్ని గ్రామాల నుండి అన్ని రాజకీయ పార్టీలు తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్లడి దేవకుమార్ వస్తారని ఆయన తెలిపారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *