డ్రిప్పు పరికరాల వాడుకలో మెలకువలు పాటించాలి

డ్రిప్పు పరికరాల వాడుకలో మెలుకువలుపాటించాలని ఉద్యానవన అధికారి రవి అన్నారు. మండలంలోని ఉమామహేశ్వరపురం గ్రామంలో బుధవారం మైక్రో ఇరిగేషన్ ఆధ్వర్యంలో డ్రిప్పు పరికరాల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి మాట్లాడుతూ డ్రిప్పు ద్వారా మొక్కలకు అందించేపోషకాలు నేరుగా మొక్కలకు చేరి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పంట అయిపోయిన తర్వాత, డ్రిప్పు వాడిన తర్వాత ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే యాసిడ్ ట్రీట్మెంట్ నీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు సాగు ఖర్చు తగ్గించుకొని నికర ఆదాయం పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ మైక్రో ఇరిగేషన్ అధికారిని అమృత వర్షిని, వీ ఎ ఏ డి రాము, నేటాఫిమ్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *