ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎన్డీపీఎల్ విక్ర యాలకు పాల్పడుతూ సెబ్ పోలీసులకు పట్టుబడ్డ నిందితులకు బుధవారం దర్శి జేఎఫ్ సీఎం న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. కేసుకు సంబంధించిన వివరాలను సెబ్ సీఐ సుందరరామయ్య వివరించారు. తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన జి. నాగార్జునరెడ్డి, తూర్పు గంగవరంకు చెందిన వెంకటేశ్వర్లు, బొద్దికూరపాడుకు చెందిన శివారెడ్డిలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలించిన 260 మద్యం సీసాలతో 2020 జులై 22 వ తేదీన సెబ్ పోలీసులకు పట్టుబడగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరి చారు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి ఒక్కొరికీ ఏడాది (12 నెలలు) జైలు శిక్ష, రూ. 2,00,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
అక్రమ మద్యం కేసులో ముగ్గురికి జైలు -నేరస్థులకు జైలు శిక్ష
05
Oct