ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని శంకరాపురం గ్రామంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదంపై వైసీపీలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. వివరాల్లోకి వెళితే శంకరాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి వైసీపీలోని స్థానిక ప్రజాప్రతి నిధులతోపాటు జే సి ఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతిని కూడా ఆహ్వానించారు. అయితే కార్యక్రమం ఏర్పాటుకు ముందు సమావేశంలో ప్రజలను ద్దేశించి ప్రసంగించేందుకు సభా వేదికను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక పైకి ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి, జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, జె సి ఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతిని పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గానికి చెందిన జే సి ఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతిని ప్రోటోకాల్ ప్రకారం ఎలా పిలుస్తారంటూ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గానికి చెందిన మేదరమెట్ల కోదండరామయ్య ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గీయులు మధ్య వివాదం జరిగింది. దీంతో అధికారులు అవాక్కై ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ ఇరు వర్గాలకు సర్ది చెప్పి సభా వేదిక కార్యక్రమాన్ని రద్దుచేసి కేవలం శిబిరాన్ని మాత్రమే నిర్వహించారు. దీంతో ఎవరికి వారు అక్కడి నుండి వెళ్లిపోయారు . మేడికొండ జయంతి శిబిరంలో వైద్య సేవలు పరిశీలించారు. విషయం తెలుసుకున్న ముండ్లమూరు ఎస్ ఐ యువి కృష్ణయ్య జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించి వివాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరం ముండ్లమూరు, మారెళ్ళ వైద్యాధికారులు వి జ్యోతి, బి మధు శంకర్ ల ఆధ్వర్యంలో300 మందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ విజిటర్ కే ఏ రాజు, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, కే అంజమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శులు టి శారద ,జి సంధ్య, పి శ్రీదేవి, ఏఎన్ఎం శారద, సిహెచ్ఓ కోడూరి శశి, జయశ్రీ, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.




