ప్రస్తుతం సజ్జ పైరు పక్వానికి వచ్చినందున మరో పది రోజుల్లో కోతకు వస్తుందని జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు ఏ ప్రభాకర్ తెలిపారు. మండలంలోని శివరామపురం లో గురువారం పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జ పైరును పరిశీలించారు. రైతు లకు పలు సలహాలు, సూచనలు చేశారు. కోత దశలో ఉన్న సజ్జ పైరును చిలుకలు, పిట్టలు ఎక్కువగా తింటాయని చెప్పారు. వాటి నుండి పంటను కాపాడుకునేందుకు తళుకు రిబ్బన్లు పంట పొలం చుట్టూ ఏర్పాటు చేసుకోవాల న్నారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి ప్రసాదరావు ,వీఏఏ రాజశేఖరరెడ్డి ఉన్నారు.

