పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలి – పశువిజ్ఞాన బడి లక్ష్యాలను సాధించాలి – రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ వెంకటరావు

పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలిన జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అదనపు డాక్టర్ వెంకటరావు అన్నారు. జిల్లా డిఎల్ఏ సమావేశపు మందిరంలో గురువారం సహాయ సంచాలకులకు, పశువైద్యులకు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్, జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటరావు మాట్లాడుతూ… పశువిజ్ఞాన బడి లక్ష్యాలను పూర్తిగా సాధించే విధంగా కృషి చెయ్యాలని కోరారు. అందిస్తున్న సేవలు, ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. యర్రజర్లలో దేశీయ గోజాతి ఫాంను, పశువైద్యశాలను, కందులూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులతో పలు అంశాలపై మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కె. బెబి రాణి మాట్లాడుతూ… వైఎస్సార్ పశుభీమా పథకం జిల్లాలో అధిక మంది రైతులు లబ్దిపొందేలా పనిచేసిన వైద్యులను సిబ్బందిని ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదిందించినందుకు అదనపు డైరెక్టర్ ప్రతి ఒక్కరూ చక్కగా పనిచేస్తే. గుర్తింపు తప్పనిసరిగా వస్తుందని జిల్లా బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ షేక్ కాలేషా, డాక్టర్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ సోమయ్య, సహాయ డాక్టర్ వెంకట రామిరెడ్డి, ఒంగోలు పశువైద్యులు డాక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *