రైతులు విచక్షణా రహితంగా పురుగు మందులు వాడి అదనపు భారాన్ని పెంచుకుని నష్టపోవద్దని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త అన్నపూర్ణ అన్నారు. యర్రగొండ పాలెం ఆర్జేకేలో శుక్రవారం ఎడీఏ నీరజ ఆధ్వర్యంలో సంకల్ప సత్తాహ్ కార్యక్రమంలో నిర్వహించారు. జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త అన్నపూర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, ఈ-క్రాప్ నమోదు వలన కలిగి ఉపయోగాలు వివరించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. సేంద్రీయ, జీవన ఎరువుల విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రైతులు ఉత్తమ యాజమాన్యా పద్ధతులతో పాటు సాంకేతికను ఉపయోగించుకుని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఆత్మ ఆధ్వర్యంలో నర్సాయపాలెం, కాశి కొండ , పీఆర్ తండాలలో క్షేత్రీయ పర్యటన చేసి పత్తి, మిరప, కంది, వరి, ఆముదాలను పరిశీలించి ఆశించే పురుగులు జీవిత చరిత్రను వివరించి, నివారణకు చర్యలను తెలిపి అవసరమైన పుస్తకాలను ఉచితంగా పంపిణీచేసారు. జీవన ఎరువుల ఉపయోగాలను వివరించని తండా రైతులకు జీవన ఎరువులను వాడు విధానంను పీపీ ద్వారా వివరించి తక్కువ ధరలకు అందించారు. ఆయా కార్యక్రమాలలో డీఎల్డీఓ సాయి కుమార్, హార్టికల్చర్ అధికారి ఆది రెడ్డి, వ్యవసాయాధికారి జవహార్ నాయక్, ఆత్మ ఎవోలు శేషమ్మ, శైలజ, ఎఎఏలు మంత్రు నాయక్, సురేంద్ర నాయక్, ఆదిలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



