ప్రభుత్వం ఉద్యాన వన శాఖ అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖాధికారి వై గోపిచంద్ అన్నారు. ఒంగోలు ప్రాంతీయ ఉద్యాన శిక్షణ సంస్థలో శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ సమీకృత సాగు నీరు మరియు వ్యవసాయ పరవర్తన పథకం (ఏపీఐఐఎటిపి) ఆధర్యంలో శుక్రవారం బత్తాయి, నిమ్మ సాగు చేయు వ్యవసాయ సంఘాలు (ఎప్పీఓ) రైతులకు అవాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ…. బత్తాయి, నిమ్మ తొటలలో కాయ పెరిగే దశలో ఉన్నాయని రసం పీల్చే పురుగులు రాత్రి వేళలో ఆశిస్తాయని చెప్పారు. సమగ్ర సస్యరక్షణ చర్యలలో బాగంగా కోమ్మ కత్తిరింపులు, కాయ నాణ్యతను దెబ్బతీసి త్రిప్స్, మంగు నల్లి నుండి పంటను రక్షించుకోవాలని చెప్పారు. నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ మెనోక్రొటోఫాస్ మరియు 1.5 గ్రా దయో విట్ ను కలిపి పిచికారి చెయ్యాలని చెప్పారు. వారం రోజుల తర్వాత లీటరు నీటికి 2.0 మి.లీ ఒమైట్ ను కలిపి పిచికారి చెయ్యాలని అని సూచించారు. ఎపీ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) డైరెక్టర్ పీవీ రమణ మాట్లాడుతూ… ప్రతి రైతు డ్రిప్ పద్ధతి ద్వారా వీటిని, రసాయనిక ఎరువులను వాడటం ద్వారా నీటి ఆదా, రసాయన ఎరువులు ఆదా పాటించవచ్చని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించారు. బొబ్బాయి సాగులో తీసుకోవాలని జాగ్రత్తలను తెలిపారు. ప్రాంతీయ ఉద్యాన శిక్షణ సంస్థ ప్రిన్సిపాలస్ ఎం. శ్రీలక్ష్మి మాట్లాడుతూ… బత్తాయి, నిమ్మ సాగు చేయు రైతులకు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవటం వలన కలిగి ప్రయోజనాలు వివరించారు. దర్శి ఉద్యాన శాఖాధికారి రవి వెంకన్నబాబు మాట్లాడుతూ…. నాణ్యమైన కొబ్బరి, మామిడి, నిమ్మ మొక్కలు ఉద్యాన నర్సీలో అందుబాటులో ఉన్నాయని డిపార్ట్మెంటు నిర్ణయించిన ధరలకే రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. కంభం, అర్ధవీడు, బెస్తవారి పేట, తాళ్లూరు మండలాలకు చెందిన ఎన్టీవీ రైతులు పాల్గొన్నారు.


