వెండి తెర, బుల్లితెరలపై హాస్యనటుడిగా, అమృతం సీరియల్ ఫెయిల గా ప్రఖ్యాతిగాంచిన ఎన్. శివన్నారాయణ శుక్రవారం తాళ్లూరు వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామం మండలంలోని శివరాంపురానికి వెళుతూ మార్గమధ్యంలోని తాళ్లూరులో కొంత సేపు వి కే జూనియర్ కళాశాల , వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశా లలను సందర్శించారు. ఆయన రాకతో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగారు. తరగతి గదిలోకి వెళ్లి ప్రస్తుతం చదువులు సాగుతున్న తీరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. బాగా చదువు కొని ఉన్నతంగా స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం క్రీడా మైదానం వద్దకు వచ్చి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్కడి పరిస్థితుల గురించి పలువురు సిబ్బంది ఆయనకు తెలియజేశారు. కామర్స్ అధ్యాపకుడు శ్రీధర్, ఒంగో లులోని శివానీ విద్యాసంస్థల అధినేత నాగేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు.




