మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద రైతువారి అవసరాలకు చెందిన పనులకు ప్రాధాన్యత నిస్తున్నట్లు ఎంపీడీవో కె.యుగకీర్తి తెలిపారు. తాళ్లూరు మండలంలోని బెల్లంకొండవారిపాలెం గ్రామంలో ఉపాధిపనుల గుర్తింపు కోసం శుక్ర వారం గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో కె వై కీర్తి మాట్లాడుతూ… ఈ పథకం లో గ్రామాల్లో పంటల కాలువలు, చెక్ డ్యాంల పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ఈసీ ప్రసాద్ మాట్లాడుతూ… భూగర్భ జలాలు పెరిగేందుకు ఇంకుడుగుంతలు, రైతుల పొలాల్లో రైతు వారి కుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామంలో ఏ పనుల వల్ల ఉపాధికూలీలకు పనులు దొరుకుతాయో గుర్తించాలన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జిఎస్ ప్రభాకర్ రెడ్డి ,ఈసీ ప్రసాద్, గ్రామకార్యదర్శి శ్రీవల్లి, టీఏ రమేష్ లు పాల్గొన్నారు.
