సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను విస్తృతంగా ఉపయోగించాలి. -కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి.

బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగించాలని, మండల స్థాయి నుంచి పార్టీ బలపడేవిధముగా ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేయాలని కేంద్ర ఎస్టీ మోర్చా, సోషల్ మీడియా సభ్యులు, సౌత్ ఇండియా ఎస్టీ మోర్చా, సోషల్ మీడియా ఇంచార్జ్ పెద్దన్న రావు నాయక్ కోరారు. ఒంగోలు పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ అడిదం అనిల్ అధ్యక్షతన శుక్రవారం ఒంగోలులోని హాల్లో నిర్వహించిన సోషల్ మీడియా వర్క్ షాప్ శంఖానాదానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెద్దన్న రావు నాయక్ మాట్లాడుతూ… ఎన్నికల వేళ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం చేసే అసత్య ప్రచారాలు ఎదుర్కొంటూ ప్రజలకు నిజాలు తెలియ చేసేవిధముగా సోషల్ మీడియాను వాడాలని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్త్ర భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు పార్టీలు పని చేయడం చేతకాక కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా నిజాలు ప్రజల్లోకి ఆధారాలతో తెలియజేసే ప్రయత్నం చేయాలన్నారు. ఒంగోలు పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ అడిదం మాట్లాడుతూ ఇటీవల కేంద్ర పథకం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజనని కనిగిరిలో వైసీపీ తమ పథకంలాగా ప్రజలకు చెప్పే అబద్దపు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా విజయవంతంగా త్రిప్పిగొట్టడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఒంగోలులోని కొంతమంది సోషల్ మీడియాని ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్న వారిని సన్మానించారు.

సమావేశంలో జిల్లా ఇంచార్జి రవి శంకర్, ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, కార్యదర్శి రాజ శేఖర్, ఐటి సెల్ ఇంచార్జ్ గుఱ్ఱం సత్యనారాయణ, మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రాము, ఎస్టీ మోర్చాప్రధాన కార్యదర్శి వై శ్రీను, మహిళా మోర్చా సోషల్ మీడియా ఇంచార్జి రోజా, పార్లమెంట్ సోషల్ మీడియా కో కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్, యువమోర్చ ప్రధాన కార్యదర్శి సింగోతు రాజేష్ వర్మ, దామోదర్, శివ, యర్రగొండపాలెం అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ తిమోతి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా ఇటీవల మరణించిన ఒంగోలు అసెంబ్లీ సోషల్ మీడియా కన్వినర్ మల్లిఖార్జునకి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *