గ్రామీణ ప్రాంత ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మారెళ్ళ ముండ్లమూరు వైద్యాధికారులు బి మధు శంకర్, వి జ్యోతి అన్నారు. మండలంలోని నూజిల్లపల్లి గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆ గ్రామ సర్పంచి చొప్పరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ హాజరైనారు. ఈ సందర్భంగా వైద్యాది కారులు మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి విశేష స్పందన లభిస్తోందని వివరించారు. గ్రామాల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ఈ శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి ఆప్తాల మీక్ ఆఫీసర్ నరసింహారావు కంటి సమస్యలు ఉన్నవారికి వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 380 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి శ్రీదేవి, వీఆర్వో పున్నారావు, హెల్త్ విజిటర్ కే ఏ రాజు, సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సి హెచ్ ఓ వెంకటరావు, స్టాఫ్ నర్స్ కే అంజమ్మ, ఏఎన్ఎం శారద, తదితరులు పాల్గొన్నారు.
