వృద్ధాప్యంలో జీవనం సాగిస్తున్న దండు సుబ్బమ్మ తన భూమి తనకు ఇప్పించాలంటూ తహసిల్దార్ కార్యాలయం వద్ద బోరున విలపించింది. వివరాలలోకి వెళితే ముండ్లమూరు మండలంలోని పులిపాడు రెవిన్యూ పరిధిలో బృందావనం గ్రామ సమీపంలో గల సర్వే నెంబర్151-4 లోగల1 ఎకరా 50 సెంట్లు భూమి దండు అంజిరెడ్డి తండ్రి యానాదిరెడ్డి పేరుమీద ఉంది. సర్వేనెంబర్ 167- 1లో1 ఎకరా 66 సెంట్లు భూమి దండు రామాంజనేయులు తండ్రి అంజిరెడ్డి పేరు మీద ఉంది ఈ రెండు సర్వే నెంబర్ల మీద ఉన్న భూమి ప్రభుత్వ భూమి ,ఈ భూమిలో కంది పంట సాగు చేశారు. అయితే దర్శి గ్రామానికి చెందిన ఎరమల శ్రీనివాస్ రెడ్డి తండ్రి రామిరెడ్డి అను అతను దౌర్జన్యంగా ట్రాక్టర్ తో కంది పంటను దున్నేశాడు. దీంతో తమ పొలాన్ని ఎందుకు దున్నుతున్నావు అని ఆపే ప్రయత్నం చేసిన భూమి యజమానుల పైకి ట్రాక్టర్లు పోనిస్తూ భయబ్రాంతకు గురి చే సాడని వారు వాపోయారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో అర్జీ అందజేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు ముండ్లమూరు పోలీసుల ను కలవాలని సూచించారు. దీంతో దండు సుబ్బమ్మ ముళ్ళమూరు పోలీసులను కలువగా పోలీసు వారు రెవెన్యూ అధికారులు కలవాలని సూచించారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఆమె వాపోయింది. నా పెద్ద కుమారుడు చనిపోయాడని, నా భర్త అనారోగ్యంతో మంచాన ఉన్నాడని, నా వయసు 80 సంవత్సరాలు పైన ఉందని నేను ఆఫీసు చుట్టూ తిరగలేక పోతున్నానని నాకు న్యాయం చేయాలని అధికారులను దండు సుబ్బమ్మ వేడుకుంటుంది.
