బిజేపి యువ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పువ్వాడ దామోదర్ నియామకంతో యువతలో మరింతగా ఉత్సాహం, స్ఫూర్తి పెరుగుతాయని ధనిశెట్టి రామునాయుడు హర్షం వ్యక్తం చేసి, దామోదర్ కు అభినందనలు తెలిపారు.
ప్రకాశం జిల్లా బిజేపిలో పార్టీపై అభిమానం పార్టీ కార్యక్రమాలపై సంపూర్ణమైన అవగాహన పార్టీ నాయకుల పై గౌరవంతో ఎందరో యువకులు ఉన్నారని అలాంటి వారందరిలో యువ మోర్చా అధ్యక్ష బాధ్యత నియామకం జిల్లా అధ్యక్షునికి కత్తిమీద సాము లా ఉన్నదని, దాంతో యువమోర్చా అధ్యక్ష పదవికి పోటీ రసవత్తరంగా మిరిందని తెలిపారు. పార్టీ అధిష్టానం అందరిని డేగ కన్నుతో పరిశీలించి వ్యక్తిగత సమాచారం పరిశీలన చేసి అందరిని కలుపుకుని పోయే మంచి వ్యక్తి, విద్యార్థి దశ నుండి ఎన్నో విద్యార్థుల సమస్యల సాధనలో ఉన్న దామోదర్ కు బాధ్యతనివ్వటం పార్టికి మరింత బలం చేకురుతుందని తెలిపారు. గత 13 సంవత్సరాల నుండి పార్టీలో అన్నిరకాల బాధ్యతలను నిర్వర్తించి, పార్టీ నియమ నిబంధనలకు లోబడి, పార్టీ ఇచ్చిన అదేశానుసారం పని చేసిన దామోదర్ కృషికి పట్టుదలకు, పార్టి పై అచంచలమైన విశ్వాసం ఈ యువమోర్చా అధ్యక్ష బాధ్యత వరించడం తో స్ఫష్టమైనదని తెలిపారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దామోదర్ అని వివరించారు.
యువమోర్చా రాబోవు సార్వత్రిక ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రధాన భూమిక గా వ్యవహరిస్తుందని, ప్రతి ఒక్కరి తలలో నాలుకలా ఉంటూ ప్రతి ఒక్కరి చేత శెభాష్ అనిపించుకునే శక్తియుక్తులు దామోదర్ కు ఉన్నాయని తెలిపారు. దామోదర్ ని యువమోర్చా అధ్యక్షునిగా పివి శివారెడ్డి నియమించడం అందరికీ ఆమోదయోగ్యమైనదని తెలిపారు.