ప్రతి పేదవాడికి అవసరమైన వైద్యాన్ని కార్పొరేట్ తరహాలో ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న లక్ష్యం తోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పిటిసి మారం వెంకట్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని తెలుగువారిపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లా డుతూ… ప్రతి ఒక్కరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగనన్న గ్రామ స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వ హిస్తున్నారని తెలిపారు. జడ్పిటిసి మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. మందులు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ ఎడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ ఐ వెంకటేశ్వర్ రెడ్డి,ఎంపీడీఓ కె.వై. కీర్తి, ఎం ఈఓ జి సుబ్బయ్య, వైద్యాధికారి బి.రత్నం, స్థానిక వైసీపీ నాయకుడు బ్రహ్మారెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా, సొసైటీ చైర్మన్ యాడికి యలమందారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, కె.వి పాలెం జె సి ఎస్ కన్వీనర్ విష్ణు, ప్రత్యేక వైద్యులు పాల్గొన్నారు.







