రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి శ్రీరామరక్షగా నిలుస్తాయని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. లక్కవరంలో మంగళవారం సాయంత్రం గడపగడ పకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ప్రతి కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సగటున రెండు లక్షల వరకు లబ్ధి చేకూరిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాజీకీయాలకు అతీతం గా అమలు చేశారన్నారు. పేదలందరికీ ఇంటిస్థలాలు, అమ్మ ఒడి, డాక్రా రుణమాఫీ, రైతు పంటల బీమా, విద్యా కానుక, వైఎస్సార్ చేయూత, జగనన్న గోరు ముద్ద లాంటి పథకాలతో ప్రతి ఇంటా చిరున వ్వులు చిందుతున్నాయన్నారు. అందుకు నిదర్శనమే ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు ఆదరంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. సంక్షేమ పాలన కొన సాగాలంటే జగనన్న మరలా ముఖ్యమంత్రి చేసుకో వాల్సిన బాధ్యత మనదేనన్నారు.
*పలువురికి ఆర్థిక సాయం*
లక్కవరం ఎస్సీ కాలనీలో ప్రమాదంలో గాయపడిన రావినూతల చిన రామలింగయ్యకు, అనారోగ్యంతో బాధపడుతున్న రావినూతల లింగమ్మకు ఆర్థి సహాయం అందజేశారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కి వైఎస్సార్సీపీ మం డల అధ్యక్షుడు టి.వి సుబ్బారెడ్డి ఆధ్వర్యం లో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంక టరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మిల్లర్ బుజ్జి, వైస్ ఎంపీపీ యడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ నన్నం వరలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యురాలు రావినూతల వెంకట రమణమ్మ, కోఆప్షన్ సభ్యుడు కరిముల్లా, జేసీఎస్ కన్వీనర్ శ్రీనివా సరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు యాడిక యల్లమందారెడ్డి, ఎంపీడీవో కీర్తి, ఎంఈవో సుబ్బయ్య, ఎంఆర్వో కేవీ ప్రసాద్, ఈవో ఆర్డీ రాజు, మల్కాపురం సర్పంచ్ వలి, స్థానిక నాయకుడు బ్రహ్మ రెడ్డి, వలంటీర్లు పాల్గొన్నారు.





