ప్రజలు మెచ్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ఆయన రెండో రోజు తాళ్లూరు మండలంలోని లక్కవరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదబడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న జగనన్నకు మనమంతా అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సచివాలయాలు, వైఎస్సార్ క్లీనిక్లు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో ప్రజల సమస్యలు తీర్చుతున్నారన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వచ్చే జనవరి నుంచి అన్ని రకాల పింఛన్లను రూ.3 వేలకు పెం చుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల అధ్య క్షుడు టి.వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మేళతా ళాలు, డప్పు వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యా లతో ఎమ్మెల్యే మద్దిశెట్టికి ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి,
లక్కవరం సర్పంచ్ నన్నం వరలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు రావి నూతల వెంకట రమణమ్మ,కో ఆప్షన్ సభ్యుడు కరిముల్లా, సొసైటీ అధ్యక్షుడు యాడిక యల్లమందారెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కూకట్ల వీరబ్రహ్మం, మల్కాపురం సర్పంచ్ వలి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి




