విద్యార్థులను జ్ఞానవంతులుగా చేయడం ఉపాధ్యాయుల కృషి అని, విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనివని జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. దర్శి మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశపు మందిరంలో బుధవారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ అవార్డు పొందిన వెంకటరెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షులు మీనగ శ్రీను అధ్యక్షత వహించారు. స్కూళ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంఈఓ-2 రమాదేవి, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరక్టర్, విద్యాధికారుల సంఘ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎం భాష, దర్శి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గంగాధర్ తో పాటు ఉద్యోగోన్నతి పొందిన ఖాదర్ మస్తాన్ , నాగేశ్వరావు, రామారావు, రాజశేఖర్, తిరుపాలు రెడ్డి, ప్రకాశరావు, పెంచలయ్య, సుధాకర్, రామారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ రెడ్డి, రాగస్రవంతి తదితరులు పాల్గొన్నారు



