బీడు భూముల రైతుల ఆదాయానికి ప్రత్యేక పద్ధతి – తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు

బీడు భూములను సాగు చేసే రైతులకు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పద్ధతులు ఉపకరిస్తాయని తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదావు అన్నారు. తాళ్లూరు మండలంలోని సోమవరప్పాడు రెవిన్యూ పరిధిలో భూముల పంట క్షేత్రాలను బుధవారం ఆయన క్షేత్ర పర్యటన సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… బీడు భూములలో ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా ప్రత్యేకమైన డ్రవుట్ ప్రూఫ్ఫింగ్ పద్ధతిలో సాగు చేసినట్లయితే అధిక ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ పద్ధతిలో ప్రధానమైన పంటతో పాటు కంది, అనుబంధ పంటలైన సజ్జ, చిక్కుడు, తదితర వాటిని కూడా పండించవచ్చు అని, దీనివల్ల రైతులకు అధిక ఆదాయం పొందడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఘన జీవామృతాన్ని ఉపయోగించి ఈ భూములలో పంటలు పండించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. జీవవైవిధ్యం కలిగిన పంటలను పండించి ఆదాయం పొందవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సాగు మండల ఇన్చార్జ్ పి నరసింహులు, ఐసిఆర్పిలు పి నరేష్ బాబు, మౌనిక, పల్లవి, రమేష్, అనంతలక్ష్మి, కోటి రత్నం, ఉమాదేవి, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *