విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి – ప్రతి పాఠశాలలో లైబ్రరీ పిరియడ్ను అమలు పరచాలి – జిల్లా విద్యాశాఖాధికారి వి.ఎస్. సుబ్బారావు – ప్రభుత్వ పాఠశాలలకు లైబ్రరీ పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు పుస్తక పఠసంపై ఆసక్తి పెంచాలని జిల్లా విద్యాశాఖాధికారి వి.ఎస్. సుబ్బారావు కోరారు. రాష్ట్ర సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో గురువారం సిల్, మైసూర్ పబ్లిషర్స్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని పాఠశాలలకు సరఫరా అయిన లైబ్రరీ బుక్స్న జిల్లా విద్యాశాఖాధికారి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ… ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ఆయా పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ ఏర్పాటు చేసి విద్యార్థలకు పఠనాసక్తిని పెంచాలని కోరారు. పుస్తకాలు మంచి మిత్రులతో సమానమన్న విషయాన్ని విద్యార్థులకు తెలిపి అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నందున చిన నాటి నుండే కాంపిటేటివ్ పరీక్షలకు తయారు అయ్యే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. ఒంగోలు మండల విద్యాశాఖాధికారి టి. కిషోర్ బాబు, అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఎఎంఓ) ఏం. రమేష్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *