బత్తాయి, నిమ్మ తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా మంచి ఫలసాయం వస్తాయని వ్యవసాయ పరిశోధన స్థానం (ఎ. ఆర్ ఎస్) శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదవి అన్నారు. తాళ్లూరు వ్యవసాయాధికారి కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దాతు ఇనుప ధాతు లోపం ఆశించినందున ఆకులు పసుపు రంగులో మారాయని అన్నారు. నివారణకు 13-13-0-13 అనగా నత్రజని బాస్వరం మరియు సూక్ష్మపోషకాలు కలిసిన మిశ్రమాన్ని మొక్కలకు వాడాలని తెలిపారు. బెట్ట వాతావరణం ఎక్కువగా ఉండి తేమ శాతం, ఉమ్మ తీయడటం పెరిగినప్పుడు పేను బంక, తామర పురుగు, పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయని అన్నారు. గట్లపై కలుపు లేకుండా చేస్తే పిండినల్లిని నివారించవచ్చని తెలిపారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఎస్. ఎం. ఎస్. డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ… మన నేలలకు సౌత్ గుడి రకం బాగా సరిపోతుందని అన్నారు. మొసాంచి, బటా వేరి రకాలు కూడ అనువైనవే అన్నారు. మొక్కలకు బాహర్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నారు. బత్తాయిలో నాణ్యత పెంచటానికి వైట్ పొటాషు డ్రిప్ ద్వారా ఎకరాకు 15 కేజీలు వదలాలని అన్నారు. ఉద్యానవనశాఖాధికారి ఎం రవి వెంకన్న బాబు మాట్లాడుతూ. …దర్శి ఫామ్ నందు నిమ్మ, బత్తాయి, మామిడి రకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మినీ ట్రాక్టర్స్, తైవాన్ స్పేయర్లు, షేడ్ నెట్లు, పాలీ జీలు, ఫారం పాండ్స్, మల్చింగ్ సీట్లు, హైడ్రిడ్ కూరగాయలు, రాయితీపై అందుబాటులో ఉన్నాయని కావలసిన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులు (విఏఏ)ల ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఉద్యాన పంటలకు సంబంధించిన వివరాలు కావలసిన వారు 799508922 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎఈఓ నాగరాజు, విఏఏ లు, ఫిషరీస్ ఆసిస్టెంట్ ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

