తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమార్కులు పెట్టిన అన్యాయమైన కేసుల నుంచి న్యాయస్థానంలో న్యాయం జరగాలని, ఆరోగ్యం నిలకడగా ఉండాలని కోరుతూ శంకరాపురం గ్రామంలో నీ రామాలయంలో శుక్రవారం మాజీ ఎంపీపీమందలపు వెంకటరావు, మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుకు న్యాయస్థానాల్లో మంచి జరగాలని కాంక్షిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వైసీపీ వైసీపీ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన చంద్రబాబు త్వరలో కడిగిన ఆణిముత్యం లా బయటకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


