దసరా సెలవుల్లో తరగతులు నిర్వ హిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్క స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రక టించారన్నారు. క్రిస్టియన్, మైనార్టీ పాఠశాలలకు మాత్రం ఈనెల 21 నుంచి 24 వరకు ప్రకటించి నట్లు పేర్కొన్నారు. ఈ సెలవుల్లో ప్రైవేటు పాఠ శాలలు ఎట్టి పరిస్థితులలో తరగతులు నిర్వహిం చరాదని, ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారులు/ఉప విద్యాశాఖ అధికారులు పర్యవే క్షించాలన్నారు.
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు -జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు
14
Oct