దర్శికి చేరిన సాగర్ నీరు – రైతులు సహకరించాలి – తాగునీటి కోసమే నీటిని వదిలారు – ఎన్ ఎస్ పి డి.ఈ అక్బర్ బాషా

తాగునీటి అవసరాల కోసం ఎన్నెస్పీ సాగర్ జలాలు కెనాల్ ద్వారా శుక్రవారం దరిశికి చేరాయి. ఈ సందర్భంగా ఎన్నెస్పీ డీఈ అక్బర్ బాషా మాట్లాడుతూ …తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. దరిశి, కనిగిరి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, లక్ష్మీపురం, చందవరం, రామతీర్థం జలాశయాలతో పాటు కొన్ని నోటిఫైడ్ చెరువులకు కూడా నీటిని నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల పంట పొలాలకు ఎలాంటి అవసరాల కోసం వాడరాదన్నారు. ప్రస్తుతం సాగర్లో నీరు లేనందున ఈ ఏడాది పంటలకు సాగు కోసం నీటిని ఇవ్వడం లేదని వారు తెలిపారు. ఆరుతడి పంటలకు కూడా అవకాశం లేదన్నారు. కావున రైతులు గమనించి తాగునీటి అవసరాలు తీర్చేందుకు వదిలిన నీటిని చెరువులకే నింపేందుకు అధికారులు సహకరించాలన్నారు. పది రోజులపాటు రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు నీటిని విడుదల చేస్తారని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *