పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వైస్ ఎంపీపీ యిడమ కంటి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడు సచివాలయం లో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సచివాలయం పరిధిలోని ప్రజలంతా ఆరోగ్య సురక్ష పథకం ఉపయోగించుకోవాలని కోరారు .ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. దేశంలో ఇతర రాష్ట్రంలో కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమం లేదని అన్నారు. సర్పంచ్ మందా శ్యాంసన్ మాట్లాడుతూ .. ప్రత్యేక వైద్యులతో మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందించడం పేద ప్రజలకు వరమని అన్నారు. తూర్పుంగవరం పిహెచ్సి వైద్యాధికారి బి. రత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. 426 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 200మందికి కళ్ల పరీక్షలు చేసి వారిలో 54 మందికి కళ్లజోళ్లు అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కేవీ ప్రసాద్, ఈవో ఆర్డీ కేజీఎస్ రాజు, ఎంపీటీసీ బాల కోటయ్య, వైద్యులు డాక్టర్ కే. మౌనిక, డాక్టర్ రాజేష్ యాదవ్, డాక్టర్ ప్రాణవి, డాక్టర్ అరుణకుమారి, పీఎంసీ చైర్మన్ వై. కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, నాయకులు ముచ్చుమారి బ్రహ్మారెడ్డి, ఎస్. యోగిరెడ్డి, పులి శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సాహనాబేగం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
