వెలుగు వారి పాలెంలో పాఠశాల అభివృద్ధికి తళ్లపు రెడ్డి పౌండేషన్ చేయూత – పాఠశాల ఆవరణలో ప్రొక్లయిన్ ద్వారా మురుగు కాలువ ఏర్పాటు – భవిష్యత్లో ఆటస్థలం అభివృద్ధికి చేయూత ఇస్తామని హామీ

వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాల (ఎఎ) అభివృద్ధికి తళ్లపు రెడ్డి పాండేషన్ చేయూత అందించారు. తళ్లపు రెడ్డి పిచ్చిరెడ్డి, శివారెడ్డిలు ప్రొక్లయిన్ సహకారంతో పాఠశాల ఆవరణలో ముళ్ల చెట్లను తొలగించి మురుగు నీరు పాఠశాలలోనికి రాకుండా కాలువలు తీయించారు. భవిష్యత్లో పాఠశాల ఆవరణలోని 1.5 ఎకరాలకు పైగా ఉన్న విస్తీర్ణంలో మొక్కలు నాటి, ఆట వస్తువులు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, పీసీ కమిటీ మెంబర్ ఎల్ అమల పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన తళ్లపు రెడ్డి పౌండేషన్కు ప్రధానోపాధ్యాయుడు, పీసీ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *