మాగుంట కుటుంబంపై ప్రత్యేక అభిమానం – మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -ఘనంగా ఎంపీ మాగుంటజన్మదినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యేలు, అభిమానులు

జిల్లా వాసుల్లో మాగుంట కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందని మాజీ మంత్రి, ఓం గోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎం పీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 70వ జన్మదినోత్సవం ఆదివారం స్థానిక రాంనగర్ లోని ఆయన కార్యాల యంలో అభిమానుల ఆనందోత్సాహాలు, ప్రజల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. ఒం గోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరు సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డితోపాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిల సమక్షంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ …1991లో జిల్లాకు వచ్చిన మాగుంట కుటుంబం జిల్లా అభివృద్ధిలో విశేషంగా పాలుపం చుకుందన్నారు. వయస్సు పైబడుతున్నా మాగుంట ఇంకా ఉత్సాహంగానే కనిపిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి తప్పక పోటీ చేస్తారన్నారు. ఇందుకు తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి 2.20 లక్షల మెజార్టీతో గెలిచారని, ఈ దఫా ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీతో మాగుంట గెలుపు ఖాయం అన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ..అక్టోబరు 15 వచ్చిందంటే మాగుంట అభిమానులకు ఒక పెద్దపండుగగా మారుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయన్నారు. జిల్లా పైప్ లైను పనులు పూర్తిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబట్టే నేడు ఒంగోలు నగరానికి తాగునీటి ఎద్దడి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో 60 నుంచి 70 శాతం నీరు కూడా నిల్వ ఉండడం వారి ముందు చూపునకు నిదర్శ నమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఒంగోలు శాసనసభ్యునిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని వారిద్దరినీ గెలిపించుకునే బాధ్యత వైఎస్సార్సీపీ అభి మానులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ రాజ కీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా కార్యకర్తలు, ప్రజల అభిమానం సమస్యలను అధిగ మించేలా చేశాయన్నారు. కొంత కాలం క్రితం తన కుమారుడు ఎదుర్కొన్న ఘటన తమకు చాలా ఆవేదన కలిగించిందని, ఈ క్రమంలో వైఎస్సార్సీపీతమకు అండగా ఉండడంతోబాటు ఢిల్లీకి వచ్చి సైతం తమను ఓదార్చిన బాలినేని, కరణం బలరాం లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శిద్దా సుధీర్, మాగుంట రాఘవరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి , మాగుంట నిఖిల్ రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్రావు, వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, ఒంగోలు డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనా రాయణ, వెలనాటి మాధవరావు, తాటిపర్తి: చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, పలువురు అధికా రులు పాల్గొని, జిల్లాలోని పలు మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *