పౌష్టిక ఆహారం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు అన్నారు. మండలంలోని పసుపు గళ్ళు గ్రామంలో గల సచివాలయం వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుపరుచుకోవాలని అన్నారు. ప్రపంచ మానవాళి ఆహార ఉత్పత్తులతో మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. సమతుల్యత ఆహారం లో బలమైన పోషక విలువలు కలిగినసమతుల్యత ఉంటుందన్నారు. మనిషికి కావాల్సిన పోషక విలువలు కలిగిన సమతుల్యత అందనప్పుడు ఆలోచన శక్తి దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి చింతా శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
