నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ, పీజీ రెండవ సెమిస్టర్ ఫలితాలలో హర్షిణి విద్యార్థులు ప్రతిభ

నాగార్జు యూనివర్సీటీ డిగ్రీ మరియు పీజీ రెండవ సెమిస్టర్ ఫలితాలలో ఒంగోలు హర్షిణి (ఐఓఎం) కళాశాల విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రతిభ చాటినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు కళాశాల చైర్మన్, కరస్పాండెంట్, సిబ్బంది అభినందించారు. ప్రతిభ చాటిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి….. బీఎస్సీ(MCCS) విభాగంలో సి.హెచ్.వనజ 393/400 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు. బీఎస్సీ (MPCS) విభాగంలో పి.వైష్ణవి 390/400 మార్కులతో మొదటి స్థానాన్ని, ఏ అనూహ్య 388/400 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు.బీఎస్సీ అగ్రికల్చర్ విభాగంలో డి.వర్ష 425/450 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు.బిఎస్సి (MSCS) విభాగంలో బి.జ్యోతిక మరియు టి.జయవర్షిని 388/400 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు. బి సి ఏ విభాగంలో డి.లక్ష్మీశీతల్ 435/450 మార్కులతో మొదటి స్థానాన్ని, కె.అద్వితి 434/450 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, డి.స్నేహధరణి 433/450 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. బిఎస్సి మైక్రో బయాలజీ విభాగంలో ఎం.మెర్సీ 423/450 మార్కులతో మొదటి స్థానాన్ని, ఎం.పావని 421/450 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. బిఎస్సి (TMW) విభాగంలో జి.నాగమణి 415/450 మార్కులతో మొదటి స్థానాన్ని, జి.లక్ష్మి 414/450 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, ఎస్.పూజిత 412/450 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. బీకాం కంప్యూటర్స్ విభాగంలో సిహెచ్.సింధు 313/350 మార్కులతో మొదటి స్థానాన్ని, ఈ.ఇంద్రలహరి మరియు ఎస్.భాగ్యశ్రీ 312/350 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు.బీఎస్సీ (BZC) విభాగంలో ఎస్.కే.ఆశాభాను 399/450 మార్కులతో మొదటి స్థానాన్ని,ఎం.వెంకట శిరీష 392/450 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. బి బి ఏ విభాగంలో ఎస్కే.హప్స 316/400 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు. బిఎ విభాగంలో ఎస్కే.దనీష్ యామిన్ 255/300 మార్కులతో మొదటి స్థానాన్ని,కె. ఆశీర్వాదం 252/300 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, జి.ఈశ్వరి 250/ 300 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత , డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు , పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి , ఏవో ర్యాంకర్ శ్రీనివాసరావు , ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *