జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు ఎంతో మేలు కలుగుతుందని సర్పంచిలు కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డిలు అన్నారు. దోసకాయలపాడులో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు. దోసకాయలపాడు, బెల్లంకొండ వారి పాలెం సర్పంచిలు కోట శివలక్ష్మి వెంకటరామిరెడ్డి, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డిలు శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు అందించారు. కంటి అద్దాలు పంపిణీ చేసారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని ప్రదర్శించి ప్రాముఖ్యతను వివరించారు . ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంఈఓ జి. సుబ్బయ్య, ఈఓఆర్డీ కెజిఎన్ రాజు, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, గ్రామకార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




