తాళ్లూరు సబ్ ఇన్స్ఫెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సె)గా వైవీరమణయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొండెపి ఎస్సె గా వైవీ రమణయ్యపనిచేస్తూ బదిలీపై తాళ్లూరు వచ్చారు. ముందుగా గుంటి గంగా భవాని అమ్మవారిఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం…… తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో విధులలోచేరారు. శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ఎవరైనా సరే తనను నేరుగా కలసి తమ సమస్యలను చెప్పుకొవచ్చని చెప్పారు. శాంతి భద్రతలవిషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఎస్సై మోహనరావు, సిబ్బంది ఎస్సైకి ఘన స్వాగతం పలికారు. గుంటి గంగా భవాని ఆలయంలో ఆలయ మర్యాదలతో మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, దేవస్థాన అధికారి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. పూజారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎన్ బి పాలెం సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి,ఉప సర్పంచి కాశి రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవదానం, గురు బ్రహ్మం తదితరులు …..ఎస్సైని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.





