రానున్న ఎన్నికలలో బిజేపి విజయంలో ప్రముఖ పాత్ర పోషిస్తాం.- బిజెపి ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరికే లక్ష్మణ్ – భాద్యతల స్వీకరణ సందర్భముగా ఆత్మీయ సమ్మేళనం

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పలువురికి నూతన బాధ్యతలు అందించడం, మరికొందరిని బాధ్యతలలో ఉన్నత స్థానం చేర్చడం జరుగుచున్నది. ఈ నేపథ్యంలో భాగంగా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా పెరిక లక్ష్మణ్ ను జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి నియమించారు. ఈ సందర్భంగా స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్ నందు పెరిక లక్ష్మణ్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సమావేశంలో జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా నిర్వహించగలదిట్ట, అందరితో స్నేహభావంతో మెలుగుతూ జిల్లాలోని నలుమూలల్లో పార్టీ ఉన్నతికి కృషి చేసే నాయకుడు పెరికే లక్ష్మణ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పేముల మోజీ మాట్లాడుతూ పార్టీపై సంపూర్ణమైన అవగాహన కలిగి, ఉన్నత లక్ష్యాలను సాధించగల నేర్పరి పెరిక లక్ష్మణ్ అశ్లాంఘించారు. జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గాన్ని గుర్తించి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గంలో కార్యదర్శిగా పేముల మోజీని రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి నియమించడం, వీరిద్దరి నాయకత్వంలో జిల్లాలో బిజెపి పట్టుకు మరింత బలం చేకూరినట్లైనదని బాపట్ల బిజెపి ఇంచార్జ్ పివి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాబోయే ఎన్నికల్లో జిల్లాలో బిజెపి విజయానికి విస్తృతమైన కృషిచేసి ప్రతి నియోజకవర్గంలోని శక్తి కేంద్రాలను బలోపేతం చేస్తూ సామాజికపరంగా ప్రతి ఒక్కరికి పార్టీ లక్ష్యాలను తెలుపుతూ ముందుకు సాగుతామని మరియు కానపై నమ్మకంతో ఎస్సీ మోర్చా అధ్యక్ష బాధ్యతను ఇచ్చిన పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పెరికే లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు.

ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు మలినేని గీతాంజలి, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, సీనియర్ నాయకులు నన్ను పోగు సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జాజ్జర కృష్ణవేణి, ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుంచాల వెంకట శివ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడ దామోదర్, ఎస్టీ మోర్చా ఏలూరి శ్రీనివాసరావు, యం. పుల్లయ్య, యస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అంజనేయులు, ప్రకాశం జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు తదితరులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *