మీ మెప్పు కోసంమాకేంటీ శిక్ష! – కేంద్రాలను వదిలి పరుగులు…: అంగన్వాడీలకు అందని ఖర్చులు

ప్రజారోగ్యం బాగు కోసం శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో సచి వాలయాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం…. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా కార్పొరేట్ తరహాలో మెరు గైన వైద్య సేవలందిస్తున్నాం. రోగులను పరీక్షించి అవసరమైన మందులు కూడా పంపిణీ చేయిస్తాం –
ఇవీ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం కోసం కొందరికి అప్పులు తప్పడం లేదు. ..శిబిరాల వద్దకు వచ్చే వారికి అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్న పౌష్టికా హార పదార్థాల ప్రదర్శనే ఇందుకు కారణం. వీటిని తయారు చేసేందుకు అంగన్వాడీలకు ఎటు వంటి నగదు ఇవ్వడం లేదు. కనీసం రాకపోకలు సాగించేందుకు రవాణా ఛార్జీలు కూడా అందజే యడం లేదు. దీంతో అధికారులు, నాయకుల మెప్పు కోసం అప్పులు చేసి పిండి వంటలు సిద్ధం చేసి ప్రదర్శనకు ఉంచాల్సిన పరిస్థితి తలెత్తింది. “

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలోని అన్ని మండలాల్లోని సచివాలయాల్లో గత కొద్దిరోజులుగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. రోగులకు వైద్య సేవలందిం చడం సంగతి అటుంచితే అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం ఇవో పెద్ద పరీక్షగా మారాయి. ఏ సచివాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే ఆ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సెక్టార్ పరిదిలోని వారు పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్టాళ్ల ఏర్పాటు కోసం అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రదర్శనలో ఉంచేందుకు అవసరమైన పిండి వంటలు తదితర తిను బండారాల తయారీ, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర వస్తువులను సొంత ఖర్చుతో కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు వైద్య శిబిరం నిర్వహించే రోజున అంగన్వాడీ సిబ్బంది కేంద్రాల నిర్వహణను వదిలేసి రావాల్సి వస్తోంది.ఇప్పటికే రూ. లక్షల్లో భారం…: వైద్య శిబిరాల్లో చిరు ధాన్యా లతో తయారు చేసిన సజ్జ బూరెలు, గారెలు, జొన్నరొట్టె, రాగి బూరె, రాగి రొట్టె, లడ్డూ, మొలక గింజలు, పలు రకాల ఆకుకూ రలు, వివిధ రకాల కూరగాయలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇందుకుగాను కనీసం రూ. మూడు వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఆ ఖర్చులను అంగన్వాడీ కార్యకర్తలే సొంతంగా భరి వస్తున్నారు. జిల్లాలో వచ్చే నెల నాలుగో తేదీ వరకు 620 శిబి రాలు నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికి 435కు పైగా పూర్తయ్యాయి. ఒక్కో శిబి రంలో ప్రదర్శించిన పదార్ధాలకు రూ. మూడు వేలు చొప్పున జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.13 లక్షలకు పైగా ఖర్చయ్యాయి.
ఇంకా నిర్వహించాల్సిన వాటికి మరో రూ.5.50 లక్షలకు పైగా అంగన్వాడీల చేతి చమురు వదలనుంది. ఇదిలా ఉంటే రాకపోకలకు కూడా ఖర్చులు చెల్లించడం లేదు. వీటన్నింటినీ వాహనాల్లో శిబిరాలకు చేర్చాల్సి వస్తుండటంతో రవాణా ఖర్చులు అదనపు భారంగా మారాయి.
నాయకులు, అధికారులకే ఆనందం …:
వైద్య శిబిరాల
వద్దకు వచ్చే గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టి కాహార పదార్థాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివ రించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల అందుకు భిన్నంగా సాగుతోంది. శిబిరాల వద్దకు వచ్చే అధికార పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆయా వంటకాలను తింటున్నారు. వాటి రుచిని గమనించి ఆనందిస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితులతో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు తమకు ఓ శిక్షగా మారాయని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *