జాతీయ స్థాయి ఇన్స్పెర్ మనక్ పోటీలలో ప్రతిభ చాటిన పుల్లల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మల్లెల నిఖిల్ చంద్ను గురువారం జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ అభినందించారు. జాతీయ స్థాయి ఇన్స్పెర్ పోటీలలో ఈనెల 8 నుండి 11 వరకు ఢిల్లీలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 35 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అందులో టాప్ 60లో నిఖిల్ ప్రదర్శించిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోర్ వే యాక్సా మిషన్ నిలిచిందని జిల్లా విద్యాశాఖాధికారి వి. ఎస్ సుబ్బారావు వివరించారు. విద్యార్థిని అభినందించిన కలెక్టర్ రాబోరు రోజులలో ఇలాగే మంచి ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావటంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించారు. విద్యార్థిని, గైడ్ ఉపాధ్యాయుడు మస్తాన్ వలిని కలెక్టర్ శాలువా కల్పి అభినందించారు. విద్యార్థికి రూ.10వేల నగదును జిల్లా విద్యాశాఖాధికారి ఎఎస్ సుబ్బారావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతిగా అందించారు. జిల్లా సైన్స్ అధికారి టి రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వర రావు, జానీ బాష, నాగేశ్వరావు, రాములు పాల్గొన్నారు.

