రైతులు సాంప్రదాయ పంటలకు భిన్నంగా నూతన పంటల సాగుతో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ పేర్కోన్నారు. కలెక్టరేట్ వద్ద గురువారం ప్రభుత్వం చేపట్టిన ఆరోమా మిషన్ (సుగంధ ద్రవ్యాలు వంటలు) సాగును ప్రోత్సహించే నిమిత్తం ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల విజ్ఞాన యాత్రను జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 300 ఎకరాల్లో ఆరోమా పంటల సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. పంట మార్పిడిలో బాగంగా ఆరోమా పంటలైన వట్టి వేరు, లెమన్ గ్రాస్, పామ్ రోజా వంటి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. నూతన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా మరింత స్థిర పడతారని అన్నారు. ఉద్యాన వనశాఖధికారి గోపి చంద్ మాట్లాడుతూ. ….. జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, బేస్తవారి పేట, కంభం ప్రాంతాల్లో రైతులు లెమన్ గ్రాస్, ఫామ్ రోజా పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రాంత రైతుల సాగు పద్దతులను అవగాహన కల్పించటానికి ఈ ప్రాంత రైతులకు విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల పంటలకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. జిల్లాలో లెమన్ గ్రాస్ పరిశీలినకు వెళ్తున్నట్లు చెప్పారు. ఉద్యాన వన శాఖ అమలు చేస్తున్న అనేక పథకాలు పశ్చిమ ప్రకారంలో ఎక్కువగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు విజ్ఞానాన్ని పంచుకుని ఈ ప్రాంతంలో కూడ మంచిగా సాగు చేయాలని ఆకాంక్షించారు


