మహిళా అభివృద్ధికి మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు- తీగల సత్యవతి

కేంద్ర ప్రభుత్వం మహిళల స్వావలంబనకు ఎన్నో విధాలుగా కృషి చేస్తుందని వానిలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను ప్రధాని నరేంద్ర దామోదర్ మోడీ అమలు చేస్తున్నారని ఆ పథకాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని వాని ద్వారా లబ్ధి పొందుతూ తమ అభివృద్ధికి మహిళలందరూ బాటలు వేసుకోవాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి పేర్కొన్నారు సింగరాయకొండ మండల బిజెపి ఉపాధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా సోమరాజు పల్లె కాలనీ రైల్వే గేటు వద్ద ఏర్పాటుచేసిన ప్రకృతి సేవ కార్యక్రమంలో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తీగల సత్యవతి మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మాతృ వందన యోజన పథకం మరియు మహిళలకు పోషకాహారం అంగన్వాడి సెంటర్ల ద్వారా అందించడం ఇలా ఎన్నో విధాలుగా మహిళల స్వావలంబనకు అభివృద్ధికి పథకాలను అమలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పది మొక్కలను నాటారు.
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొని వారి వ్యాపారం దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి దంపతులు, జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు పావని దంపతులు మరియు ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, కే మురళి, ఎం నరేష్ లు ప్రకృతి సేవ లో మొక్కలు నాటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev అవకాశాలన్నీ మన దేశంలోనే!కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ -వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 11వ స్నాతకోత్సవం- 1820 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం – 51 మంది విద్యార్థులకు బంగారు పతకాలు- ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లుహైదరాబాద్ లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి, హైదరాబాద్ లోని విజ్జా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున -అవార్డు గ్రహీత కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్లు అవకాశాలు అపారం… అందిపుచ్చుకోండి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్ టాక్స్ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – చక్కని ప్రణాళిక ఎంతో కీలకం : హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి – వినూత్న పరిష్కారాలు వెతకండి : హైదరాబాద్ లోని విజ్జా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి – సమ ప్రాధాన్యం ఇస్తే మేలు : ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి – పట్టుదల, సంకల్పం మరువకూడదు : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య-విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం : విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *