40 శాతం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల సరఫరా ప్రభుత్వం సరఫరా చేసే శనగ విత్తనాలు – సన్న, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకునే అదనపు సబ్సిడీ – జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు

పంటల సాగుకు వినియోగించే విత్తనాలకు, బహిరంగ మార్కెట్లో ఆహార పదార్థాల కోసం వినియోగించే శనగ విత్తనాలతో కొంత వ్యత్యాసం ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో శనగ విత్తనాలపై ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. విత్తనాల కోసం వినియోగించే విత్తనాలు శుద్ధి చేసి ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసేందుకు అదనపు ఖర్చులు ఉంటాయన్నారు. అందువల్లే ధరల వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర మినిమం సీడ్ సర్టిఫికేషన్ స్టాండెడ్ (ఐఎంఎస్సీ ఎస్) – 2013 నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో ఉంటాయని తెలిపారు. శనగ విత్తనాల ధరలు రాష్ట్ర స్థాయి ధరల కమిటీ నిర్ణయించిన మేరకు ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 15 నాటికి అప్పటి మార్కెట్ ధరలు అనుసరించి విత్తనాల సేకరణ, ప్రాసెసింగ్, రవాణాకు సంబంధించిన ఖర్చులతో కలిపి జీజే-11 రకం విత్తనాలు రూ.8,100, కాగ్ -2 రకం విత్తనాలు రూ.14,050 క్వింటాకు నిర్ణయించా రన్నారు. గత ఏడాది 25 శాతం సబ్సిడీ ఉన్న విత్త నాలకు, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సన్న, చిన్న కారులు రైతులకు దృష్టిలో ఉంచుకుని 40 శాతం సబ్సిడీగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తన సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *